ఎన్‌వై పార్టీని వీడటం బాధాకరం | - | Sakshi
Sakshi News home page

ఎన్‌వై పార్టీని వీడటం బాధాకరం

Apr 2 2023 7:44 AM | Updated on Apr 2 2023 7:44 AM

మాట్లాడుతున్న మంత్రి శ్రీరాములు - Sakshi

మాట్లాడుతున్న మంత్రి శ్రీరాములు

కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వకపోతే తాము పిలిచి బీజేపీలో

సాక్షి,బళ్లారి: కూడ్లిగి ఎమ్మెల్యే ఎన్‌వై గోపాలకృష్ణ పార్టీని వీడటం తనను ఎంతో బాధించిందని, ఆయనకు గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వకపోతే తాము పిలిచి బీజేపీలో చేర్పించుకుని కూడ్లిగి నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్‌ ఇప్పించి గెలిపించామని మంత్రి బీ.శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన శుక్రవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్‌వై గోపాలకృష్ణ పార్టీ నుంచి ఎందుకు వెళ్లిపోతున్నారో స్పష్టత లేదన్నారు.

కారణాలు లేకుండా పార్టీని వీడటం రాజకీయ పదవీ కాంక్షతోనే అయి ఉంటుందని గుర్తు చేశారు. ఆయన పార్టీ వీడటంపై కార్యకర్తల్లో కూడా ఆవేదన ఉందన్నారు. తాను బళ్లారి గ్రామీణ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని దరఖాస్తు చేసుకున్నానని, ఇంకా పార్టీ పెద్దలు ఖరారు చేయలేదన్నారు. అయితే ఎక్కడ నుంచి పోటీ చేయాలని సూచించినా పార్టీ ఆదేశాలు పాటిస్తానన్నారు.

బళ్లారి గ్రామీణ నియోజకవర్గంలోనే ఎక్కువగా పర్యటించి, ప్రచారం చేస్తున్నాననేదాంట్లో నిజం లేదన్నారు. అన్ని ప్రాంతాల్లో పర్యటించి పార్టీ అభ్యర్థుల గెలుపునకు శ్రమిస్తానన్నారు. రాష్ట్రంలో స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితాలో తన పేరు కూడా ఉంటే తన నియోజకవర్గంతో పాటు అన్ని జిల్లాల్లో కూడా ఎన్నికల ప్రచారం చేస్తానన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎన్ని ఎత్తులు వేసినా విజయం బీజేపీనే వరిస్తుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement