రోడ్డు ప్రమాదాలపై నిర్లక్ష్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాలపై నిర్లక్ష్యం వద్దు

Nov 6 2026 1:38 AM | Updated on Nov 6 2026 1:38 AM

● ప్రజలకు అవగాహన కల్పించండి ● కలెక్టర్‌ చిత్రామిశ్రా

కరీంనగర్‌/కరీంనగర్‌ అర్బన్‌: రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులకు సాయం అందించాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం పీఎం రహత్‌, రహ్‌వీర్‌ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రహత్‌ పథకం కింద రూ.1.5 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు అందిస్తారని వివరించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి రహ్‌వీర్‌ పథకం కింద రూ.25వేల నగదు ప్రోత్సాహకం అందిస్తారని తెలిపారు. బాధితులకు సాయం చేసే వారికి చట్టపరమైన రక్షణ కల్పించడంతోపాటు వారి వివరాలను గోప్యంగా ఉంచుతారని పేర్కొన్నారు. హిట్‌ అండ్‌ రన్‌లో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం అందించే పథకం అమల్లో ఉందని తెలిపారు. అడిషనల్‌ కలెక్టర్‌ రెవెన్యూ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్‌వో స్వామి, డీటీవో జైపాల్‌రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజగోపాల్‌రావు, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, ఏసీపీ శ్రీనివాస్‌జీ, ఈడీఏఆర్‌ కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌ గౌడ్‌, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌ మోతే రాజు, డీఎం విజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

ఇబ్బందుల్లేకుండా ధాన్యం కొనుగోళ్లు

వానాకాలం ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లో ఎప్పటికప్పుడు జమయ్యేలా చూడాలని సూచించారు. గురువారం రాత్రి కరీంనగర్‌ ఐడీఓసీలో పౌరసరఫరాల అధికారులు, రైస్‌ మిల్లర్లతో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ధాన్యం తరలింపు, రైతులకు చెల్లింపులు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. కటింగ్‌ పేరిట రైతులకు ఎలాంటి ఇబ్బందులు సృష్టించవద్దని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement