‘బోరు’మంటున్నాయి | - | Sakshi
Sakshi News home page

‘బోరు’మంటున్నాయి

Nov 6 2026 1:44 AM | Updated on Nov 6 2026 1:44 AM

ఎల్‌నినో ముప్పు.. ● గ్రామాలు, పట్టణాల్లో నీటి కొరత ● బోర్లు వేస్తే చుక్క రాని పరిస్థితి ● పెరిగిన నీటి వినియోగం

జిల్లావ్యాప్తంగా నీటి వినియోగం ఇలా..

నగరంలోని గణేశ్‌నగర్‌లో వరుసగా మూడు ఇళ్లకు బోర్లలో నీరు తగ్గడంతో కొత్తగా బోర్లు వేయించారు. 900– 1,000 ఫీట్ల వరకు వేసినా చుక్క రాకపోగా కనీసం తడి కూడా లేదు. దీంతో చేసేదిలేక రెండు, మూడు నెలలు చూసి అద్దెకున్న వారిని ఖాళీ చేయాలని భావిస్తున్నారు. ఇది కేవలం గణేశ్‌నగర్‌లోనే కాదు నగరంలో కాంక్రీట్‌మయంగా మారిన హెచ్చు ప్రాంతాల్లో ఇదే దుస్థితి. ఇంకుడు గుంత లేని ఇళ్లలో మరీ ఎక్కువ.

కరీంనగర్‌ అర్బన్‌: ఎల్‌నినో క్రమంలో జలవనరుల సంరక్షణ, జల కాలుష్యంపై దృష్టి కేంద్రీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షాల లేమితో పాటు కొద్దిరోజులుగా భూగర్భ జలాలు పడిపోవడంతో పల్లె, పట్టణాల్లో నీటి సమస్య ఏర్పడుతోంది. కరీంనగర్‌, హుజూరాబాద్‌, జమ్మికుంట పట్టణాల్లో సమస్య అధికంగా ఉండగా గ్రామీణ ప్రాంతాల్లోనూ పలు చోట్ల ఇదే పరిస్థితి. గతంలో 200 ఫీట్ల వరకు బోర్లు వేయగా పుష్కలంగా నీరు వచ్చేది. ప్రస్తుతం వేయి అడుగుల వరకు బోరు వేసినా నీరు రావడం లేదు. కొత్తగా బోర్లు వేసినా ఫలితం లేకపోవడంతో ఇళ్లలో నీటి సమస్య ఏర్పడుతోంది. అద్దెకు న్నవారిని ఖాళీ చేయించే పరిస్థితి ఏర్పడుతోంది.

నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు

జిల్లాకేంద్రంతో పాటు మండలాల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా బోర్ల తవ్వకాలు చేస్తున్నారు. ఒకరికి మించి ఒకరు లోతులో బోర్లు వేస్తుండటంతో భూగర్బజలాలు వేగంగా పడిపోతున్నాయి. జిల్లాలో 14 మీటర్ల లోతులోకి భూగర్బజలాలు పడిపోగా ఇపుడే ఇలా ఉంటే వేసవిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉండనుంది. వాల్టా చట్టం ప్రకారం బోర్ల తవ్వకానికి అంక్షలు విధించాలి. అంతేగాకుండా ఇంకు డు గుంతల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తే తప్ప భూగర్బజలాలను కాపాడుకోవడం కష్టమే. నగరంలోని చా లా అపార్ట్‌మెంట్లు, ఇళ్లలోని బోర్లు మార్చిలో వట్టిపోతుంటాయి కానీ ఈ సారి నవంబర్‌ నెలలోనే పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. ఎండిపోయిన బోర్లలో మళ్లీ సమృద్ధిగా నీరు రావాలంటే ఇంజక్షన్‌ బోర్‌వెల్‌ విధానమే మేలని నిపుణులు అంటున్నారు.

వృథాకు ఇలా అడ్డుకట్ట

పట్టణాల్లో, గ్రామాల్లో ఒక్కో కుటుంబం నిత్యం అన్ని అవసరాల్లో సుమారు 50లీటర్ల నీటిని వృథా చేస్తోందని నిపుణుల అంచనా. జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ వినియోగాన్ని గణనీయంగా తగ్గించొచ్చు. వంట సమయంలో బియ్యం కడిగే నీటిని పారబోయకుండా మొక్కలకు పోయాలి. వంట చేసే సమయంలో చాలా మంది ట్యాప్‌ను ఆన్‌చేసి వదిలేస్తుంటారు. మొత్తం పాత్రల్ని శుభ్రం చేసిన తర్వాత సన్నని ధారపెట్టి పాత్రల్ని శుభ్రం చేసుకోవాలి. స్నానానికి వినియోగించే బకెట్‌ నీటి సామర్థ్యం 15నుంచి 20లీటర్లు.. చాలామంది ట్యాప్‌ వదిలేసి స్నానం చేస్తుంటారు. దీంతో ఒక్కొక్కరు రెండు, మూడు బకెట్ల నీటిని వినియోగించినట్లే.. ఒక్క బకెట్‌తో స్నానాన్ని చేయొచ్చు. బట్టలు ఉతికేటప్పుడు ఒక్కొ జతకు ఒక్కొ బకెట్టు వాడకుండా ఒకసారి శుభ్రం చేసిన నీటిలో మరొక జతను శుభ్రం చేసి అటు తరువాత మళ్లీ ఫ్రెష్‌ నీళ్లలో శుభ్రం చేస్తే నీటిని పొదుపు చేయవచ్చు. బోజనం చేసిన తరువాత చేతులు కడిగేందుకు ట్యాప్‌ను పూర్తిస్థాయిలో వదిలేస్తే రెండు, మూడు లీటర్ల నీరు వృథా అవుతుంది. కార్లు, బైకులు కడిగేందుకు చాలా మంది పైపులు ఉపయోగిస్తారు. దీంతో విద్యుత్తు, నీరు ఎంతో వృథా అవుతుంది. దీనికి బదులు బకెట్‌ నీటితో తడిగుడ్డ ఉపయోగించి వాహనాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ఇంట్లో వాటర్‌ప్యూరిఫైడ్‌ యంత్రాలు వాడేవారు చాలామంది ఇంటి నీటి ట్యాంకులకు అనుసంధానం చేసి వాడుతుంటారు. నీరుశుద్ధి కావడానికి రెండింతల నీరు వృథా అవుతుంది. ఈ నీటిని బకెట్లు పెట్టి పట్టుకుని దుస్తులు పిండటానికి, వంట పాత్రలు కడగటానికి వినియోగించొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement