ఈవీఎం యంత్రాలకు పటిష్ట భద్రత | - | Sakshi
Sakshi News home page

ఈవీఎం యంత్రాలకు పటిష్ట భద్రత

Nov 6 2026 1:44 AM | Updated on Nov 6 2026 1:44 AM

కరీంనగర్‌ అర్బన్‌: కలెక్టరేట్‌ కార్యాలయ సమీ పంలో ఉన్న ఈవీఎం, వీవీప్యాట్‌ గోదామును గురువారం జిల్లా అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివాస్‌ రెడ్డి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. గోదాంలో ఈవీఎం, వీవీప్యాట్‌ యంత్రాల భ ద్రతకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం ఈవీఎం, వీవీప్యాట్‌ గోదాములను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ, సంబంధిత వివరాలతో కూడిన నివేదికలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి పంపిస్తున్నట్లు తెలిపారు. భద్రతా చర్యలు, పర్యవేక్షణ వ్యవస్థ, సిబ్బంది విధుల నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. వివిధ పార్టీల ప్రతినిధులు సత్తినేని శ్రీనివాస్‌, నాంపల్లి శ్రీని వాస్‌, పడిశెట్టి భూమయ్య, ఎర్రబెల్లి రవీందర్‌, బర్కత్‌ అలీ, కరీంనగర్‌ అర్బన్‌ తహసీల్దార్‌ నీరటి రాజేశ్‌, డీటీ ముజమిల్‌ పాల్గొన్నారు.

తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ఎల్‌నినో ప్రభావంతో నగరపాలకసంస్థ పరిధిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ తెలిపారు. ప్రజలు కూడా నీటిని పొదుపుగా వాడుకొని ప్రకృతి విపత్తును ఎదుర్కోవడంలో సహకరించాలని పిలుపునిచ్చారు. గురువారం 31వ డివిజన్‌ దుర్గమ్మగడ్డలోని హనుమాన్‌ ఆలయంలో ఏర్పాటు చేసిన తాగునీటి బోరు మోటారును కార్పొరేటర్‌ ముఖద్దర్‌ అలీతో కలిసి ప్రారంభించారు. ఎల్‌నినో ప్రభావం, రానున్న వేసవి కాలం దృష్ట్యా నగర ప్రజలకు తాగునీటి కొరత రాకుండా ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

నూతన కలెక్టరేట్‌కు ప్రభుత్వ జీవిత బీమా కార్యాలయం

కరీంనగర్‌ అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వ జీవిత బీమా (టీఎస్‌జీఎల్‌ఐ) జిల్లా కార్యాలయం ఇక నూతన కలెక్టరేట్‌ నుంచి విధులు నిర్వహించనుంది. ఇప్పటికే కార్యాలయాన్ని కలెక్టరేట్‌కు తరలించగా ఉమ్మడి జిల్లా ప్రజలకు సేవలందించనుంది. డెత్‌ క్లెయిమ్స్‌, మెచ్యూరిటీ క్లెయిమ్స్‌, పాలసీలు, పాలసీ వివరాలు, లోన్లు, ఇతర సేవలను వినియోగించుకోవచ్చు. కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోని ఉద్యోగులు, పాలసీదారులు ఇకపై తమ అవసరాల నిమిత్తం నూతన కలెక్టరేట్‌ భవనంలో రూమ్‌ నంబర్‌ 201 లోని జిల్లా బీమా కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు.

దరఖాస్తులకు ఆహ్వానం

కరీంనగర్‌ స్పోర్ట్స్‌: జిల్లాలోని 48 పాఠశాలలకు సంబంధించిన 96 మంది ఉపాధ్యాయులకు, 1,520 మంది విద్యార్థులకు మొత్తం 1616 యూనిట్ల స్కౌట్‌ యూనిఫారాలు, షూస్‌, క్యాప్స్‌, ఇతర వస్తువుల సరఫరాకు అర్హులైన స్థానిక లేదా బహిరంగ మార్కెట్‌ టెండర్‌దారుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి తిరుపతి రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించి, రూ.5వేలు డిమాండ్‌ డ్రాఫ్ట్‌ చెల్లించాలని పేర్కొన్నారు. ఈ నెల 6 నుంచి 12వరకు టెండర్‌ ఫారాలను పొందవచ్చునని పేర్కొన్నారు. పూర్తి చేసిన సీల్డ్‌ టెండర్‌ ఫారాలను, రూ.లక్ష ఈఎండీ డిమాండ్‌ డ్రాఫ్ట్‌తో కలిపి 12న సాయంత్రం 5 గంటల లోపు డీఈఓ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. సీల్డ్‌ టెండర్లను 13న జిల్లా అదనపు కలెక్టర్‌ సమక్షంలో తెరువబడునని, పూర్తి వివరాలకు 8317681792 నంబరును సంప్రదించాలని తెలిపారు.

పవర్‌కట్‌ ప్రాంతాలు

కొత్తపల్లి: విద్యుత్‌ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా శుక్రవారం ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటల వరకు 11 కేవీ హిందూపురి కాలనీ ఫీడర్‌ పరిధిలోని హిందూపురి కాలనీ, ఆర్టీసీ వర్క్‌షాప్‌ ప్రాంతం, వివేకానందపురి, మహారాజా బార్‌ వెనుక ప్రాంతం, ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్‌ 1 ఏడీఈ పి.శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement