కరీంనగర్: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఎన్హెచ్ఎం జేఏసీ కరీంనగర్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం 24వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఉద్యోగులు వినూత్న రీతిలో తమ చేతులపై గోరింటాకుతో ఎన్హెచ్ఎం జేఏసీ అని రాసుకొని నిరసన తెలిపారు. దీర్ఘకాలంగా సేవలందిస్తున్నప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల రెగ్యులరైజేషన్, వేతనాల పెంపు, ఉద్యోగ భద్రతతో పాటు ఇతర న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఎన్హెచ్ఎం జేఏసీ నాయకులు కోరారు.


