కేఎఫ్‌సీలో ఆయిల్‌ రీసైక్లింగ్‌ | - | Sakshi
Sakshi News home page

కేఎఫ్‌సీలో ఆయిల్‌ రీసైక్లింగ్‌

Nov 6 2026 1:38 AM | Updated on Nov 6 2026 1:38 AM

● నాసిరకం పదార్థాల గుర్తింపు ● ఫుడ్‌ సేఫ్టీ తనిఖీల్లో వెల్లడి

కరీంనగర్‌ అర్బన్‌: వాడిన నూనెను మళ్లీ మళ్లీ వా డుతూ ప్రజల ప్రాణాలకే ముప్పు తెస్తున్నారు. గురువారం రాత్రి ఫుడ్‌ సేఫ్టీ అధికారులు నగరంలోని కేఎఫ్‌సీలో మెరుపుదాడులు నిర్వహించగా విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నట్లుగా గుర్తించి 80 లీటర్ల నూనె స్వాఽధీనం చేసుకున్నారు. రికార్డుల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండటం, నిబంధనలను విస్మరించడం వంటి లోపాలను గుర్తించగా కేఎఫ్‌సీని సీజ్‌ చేశారు. ఆయిల్‌తో పాటు వివిధ రకాల ముడిపదార్థాల శాంపిళ్లను సేకరించినట్లు గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ రోహిత్‌రెడ్డి, ఫుడ్‌ సేఫ్టీ అధికారి అంకిత్‌రెడ్డి వివరించారు. ఆహార భద్రతా ప్రమాణాలను పాటించకుండా ప్రజా రోగ్యంతో ఆటలాడితే ఎంతటివారినైనా ఉపేక్షించమని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement