గంగాధర: ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం కాదని, వెంటనే ధాన్యం తూకం వేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గురువారం విలేకర్లతో మాట్లాడారు. మండలంలో చొప్పదండి ఎమ్మెల్యే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారే తప్ప.. తూకం మాత్రం వేయడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు వేముల దామొదర్, రామిడి సురేందర్, జోగు సాగర్, మడ్లపల్లి గంగాధర్, ఎండీ నజీర్‌హుస్సేన్, శ్రీమల్ల మేగరాజ్, ఆదిమల్లు, శ్రీనివాస్‌రెడ్డి, మల్లేశం, కనకయ్య, అఖిల్ పాల్గొన్నారు.


