రైతులను ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రైతులను ఆదుకోవాలి

Nov 6 2026 1:38 AM | Updated on Nov 6 2026 1:38 AM

హుజూరాబాద్‌: ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా జిల్లాలోని 16 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. వర్షాభావం వల్ల ఎండిపోయిన వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50 వేలు, ఇతర పంటలకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత తీర్చాలని, బైపాస్‌ మీదుగా వెళ్లే బస్సులు బస్టాండ్‌లోకి వచ్చేలా ఆర్టీసీ చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ప్రతాప్‌ శ్రీనివాస్‌, కొప్పుల శంకర్‌, కదిరె రమేష్‌, కొంకట చంద్రయ్య, రాచపల్లి సారయ్య, వెంకటేష్‌, మోరే మహేష్‌, మైస చేరాలు, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement