జగిత్యాలక్రైం/మల్యాల: మహిళ తన సన్నిహితుడితో ఉన్న సమయంలో వీడియో తీసి, బెదిరించి ఇద్దరు సామూహిక లైంగికదాడికి పాల్పడగా, వీరికి సహకరించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం మండలకేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో ఎస్సై సందీప్‌తో కలిసి సీఐ రాజ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. ఈనెల 3న ఓ మహిళ నూకపల్లి డబుల్ బెడ్‌రూం కాలనీలో తనకు పరిచయం ఉన్న వారి ఇంటికి తన సన్నిహితుడితో వెళ్లింది. సన్నిహితుడితో ఉన్న సమయంలో రాజారం గ్రామానికి చెందిన శివరాత్రి నరేశ్, గుర్రం శ్రీకాంత్ వీడియో తీసి సామూహిక లైంగిక దాడి చేశారు. వీరికి దరూర్‌కు చెందిన మారవేని మల్లేశ్, రాజారం గ్రామానికి చెందిన గుర్రం అంజయ్య సహకరించారు. వీడియో మరికొందరికి పంపారు. దీంతో బాధితురాలు ఈ నెల 6న మల్యాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నలుగురు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. వారి నుంచి ఇన్నోవా వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో నిందితులు నరేశ్‌పై 13 కేసులు, గుర్రం శ్రీకాంత్‌పై 9, మారవేని మల్లేశ్‌పై 2, గుర్రం అంజయ్యపై 1 కేసులు నమోదు కాగా, రౌడీషీట్ కూడా నమోదయినట్లు సీఐ తెలిపారు.
కిడ్నాప్ కేసులో ముగ్గురి అరెస్ట్
కరీంనగర్‌క్రైౖం: కరీంనగర్ టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురిని అరెస్టు చేశారు. సీఐ సృజన్‌రెడ్డి వివరాల ప్రకారం.. నగరానికి చెందిన బి.కమలాకర్‌రెడ్డిని అమ్మిగల్ల ప్రశాంత్ ఊరాఫ్ శశి, అమ్మిగల్ల అంజయ్య ఊరాఫ్ అంజి, కావంపల్లి శ్రావణ్ కుమార్ కలిసి ఈ నెల 4న కారులో తీసుకెళ్లారు. అతనిపై దాడిచేసి, చంపేస్తామని బెదిరించారు. సెల్‌ఫోన్ లాక్కుని ఫోన్‌పే, క్రెడిట్‌కార్డుల ద్వారా రూ.52,009 బదిలీ చేసుకుని వదిలిపెట్టారు. బాధితుడి ఫిర్యాదుతో శుక్రవారం ముగ్గురిని అరెస్టు చేసి రూ.20వేల నగదు, మూడు సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.


