మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగస్వామ్యం కావాలి | - | Sakshi
Sakshi News home page

మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగస్వామ్యం కావాలి

Aug 10 2026 1:16 AM | Updated on Aug 10 2026 1:16 AM

కరీంనగర్‌ కల్చరల్‌: మాదక ద్రవ్యాల నిర్మూలనలో యువత భాగస్వామ్యం కావాలని మేయ ర్‌ కొలగాని శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. కరీంనగర్‌ తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన యువ కవి సమ్మేళనం‘యుద్ధం మొదలైంది’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నషా ముక్త్‌ భారత్‌’ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను కవితల ద్వారా యువ కవులు ఎత్తిచూపడం అభినందనీయమన్నారు. ఎస్‌యూ రిజిస్ట్రార్‌ పి.సతీశ్‌ కుమార్‌ మాట్లాడుతూ యువ సాహిత్యం కొత్త ఆలోచనలకు వారధిగా నిలుస్తోందన్నారు. ప లువురు యువ కవులు మాదకద్రవ్యాల వ్యతి రేక సందేశంతో కూడిన కవితలు వినిపించారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు కొత్త అనిల్‌కుమార్‌, కవులు దొమ్మటి శంకర్‌, కాండూరి వెంకటేశ్వర్లు, బీవీఎన్‌ స్వామి, కేఎస్‌.అనంతాచార్య, మాధవ్‌, నీలగిరి అనిత, సాయి చరణ్‌, శ్రీకర్‌, అనిల్‌, సుగుణ, అనుష, బొమ్మకంటి కిషన్‌, ఉపేంద్ర పాల్గొన్నారు.

ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి

కరీంనగర్‌: ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘హర్‌ ఘర్‌ తిరంగా’ అభియాన్‌ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని, ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేలా బీజేపీ శ్రేణులు కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం పిలుపుని చ్చారు. హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్‌ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పార్టీ ముఖ్య నేతలతో ఆదివారం నగరంలో సమావేశం అయ్యా రు. సోమవారం నుంచి ప్రతీ ఒక్కరు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మేయర్‌ కొలగాని శ్రీనివా స్‌, డిప్యూటీ మేయర్‌ సునీల్‌ రావు, బాస సత్యనారాయణ రావు, కన్నబోయిన ఓదెలు, నాగేశ్వర్‌రెడ్డి, ప్రవీణ్‌ రావు పాల్గొన్నారు.

ప్రభుత్వం గాడి తప్పకుండా సీఎం జాగ్రత్తగా ఉండాలి

చిగురుమామిడి: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం గాడితప్పకుండా సీఎం రేవంత్‌రెడ్డి జాగ్రత్త పడాలని సీపీఐ సీనియర్‌ నేత చాడ వెంకట్‌రెడ్డి సూచించారు. చిగురుమామిడి మండలం రేకొండ, చిగురుమామిడి, పీచుపల్లి, చిన్నముల్కనూర్‌, సీతారాంపూర్‌, లంబాడిపల్లి, ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి, ఓగులాపూర్‌, రామంచ, ముదిమానిక్యం గ్రామాల్లో ఆదివారం సీపీఐ ప్రచార జాత నిర్వహించారు. చాడ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో తాత్సారం చేస్తోందన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌, హుస్నాబాద్‌ నియోజకవర్గ కన్వీనర్‌ జాగిరి సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు అందె స్వామి, పొనగంటి కేదారి, నాగెల్లి లక్ష్మారెడ్డి, గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

అసమానతల నిర్మూలనతోనే సామాజిక న్యాయం

విద్యానగర్‌(కరీంనగర్‌): దేశాన్ని పట్టి పీడిస్తు న్న కులమనే అతిపెద్ద జబ్బును అంతం చేయ డం ద్వారానే సామాజిక న్యాయం సిద్ధిస్తుందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి టి. స్కైలాబ్‌ బాబు అన్నారు. ఆదివారం కరీంనగర్‌లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో 78ఏళ్ల స్వాతంత్య్రం సామాజిక న్యాయం అనే అంశంపై సె మినార్‌ నిర్వహించారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వడ్లూరి కిషోర్‌, జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేశ్‌, గాజుల కనకరాజు, గోవర్ధన్‌, విజయ, సుకోసి శ్రీకాంత్‌, కదాసి కుమార్‌, సదానందం, సంకీర్త్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement