● నడిరోడ్డుపై ఆగిపోయిన 108 వాహనం
● అధ్వానంగా నిర్వహణ
● రెండు రోజుల వ్యవధిలోనే రెండు ఘటనలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాలో 108 వాహనాల నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో వరుసగా జరిగిన ఘటనలను పరిశీలిస్తే అర్థమవుతోంది. గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్‌తండాకు చెందిన ఓ మహిళా పేషెంట్‌ను శుక్రవారం 108 అంబులెన్స్‌లో తరలిస్తుండగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మొరాయించగా.. వీర్నపల్లి నుంచి మరో వాహనాన్ని తెప్పించి ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే ఆదివారం ఇలాంటి పరిస్థితి ఎదురైంది. గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన దస్తగిరిని సిరిసిల్ల ఆస్పత్రికి తరలిస్తుండగా సముద్రలింగాపూర్ నుంచి మొరాయిస్తూ వ చ్చిన అంబులెన్స్ ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి శివారుకు చేరుకోగానే నిలిచిపోయింది. దీంతో మరో వాహనాన్ని తెప్పించి నడిరోడ్డుపైనే ఆ వాహనంలోకి పేషెంట్‌ను మార్చాల్సి వచ్చింది.


