కరీంనగర్: బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను సోమవారం కరీంనగర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన మల్లేశంను సంజయ్ అభినందించారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై.సునీల్‌రావు, కార్పొరేటర్లు ఎన్నం లక్ష్మీ ప్రకాశ్, గాజ రమ శివరాం, కర్రె పద్మ అనిల్, నాయకులు గుజ్జ శ్రీనివాసరావు, గుంజేటి శివ, గాదగోని రమేశ్ పాల్గొన్నారు.


