వంటగ్యాస్ ధర తగ్గించాలి
కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధర రూ.50ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాకేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర రూ.50 పెంచడం మూలంగా పేద, మధ్యతరగతి ప్రజలపై తీరని భారం పడుతోందన్నారు. పెంచిన గ్యాస్ ధర తగ్గించేంతవరకు సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వర్ణ వెంకటరెడ్డి, గుడికందుల సత్యం, శ్రీనివాస్ పాల్గొన్నారు.


