సాధారణ ప్రసవాలు చేయాలి
కరీంనగర్: ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం వైద్య ఆరోగ్యశాఖ సమావేశం నిర్వహించారు. ఒక్కో పీహెచ్‌సీ వారీగా సాధించిన ప్రగతి, కాన్పులు తదితర వివరాలపై సమీక్షించా రు. ప్రతీ పీహెచ్‌సీ, ఆస్పత్రిలో సాధారణ ప్రసవాల కు గర్భిణులను ప్రోత్సహించాలన్నారు. ప్రసవాలు, ఆరోగ్య మహిళ, ఎన్‌ఆర్సీ, ఆర్బీఎస్కే, 108సేవలు, ఆరోగ్యశ్రీ, కంటి, డెంటల్ ఎగ్జామినేషన్, లెప్రసీ సర్వే, టీబీ, ఇమ్యూనైజేషన్ క్యాలెండర్, బూస్టర్ డోస్, గర్భిణుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడంపై చర్చించారు. 80శాతం డెలివరీలు ప్రభుత్వ దవాఖానాల్లోనే జరిగేలా చూడాలన్నారు. ఆర్‌బీఎస్‌కే పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశించిన సంఖ్యలో విద్యార్థులకు స్క్రీనింగ్ చేయాలని, పనితీరు మెరుగు పరచుకోకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోనే మొదటిసారి జిల్లాలో డెంటల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నామని పాఠశాలల్లో, పంచాయతీల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. టీబీ ముక్త్ భారత్‌లో భాగంగా నిక్షయ్ పోర్టల్‌లో టీబీ వ్యాధిగ్రస్తుల వివరాలు నమోదు చేయాలన్నారు. క్రిస్మస్ సందర్భంగా కేక్‌కట్ చేశారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ, అదనపు డీఎంహెచ్‌వో సుధా, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు చందునాయక్, రాజగోపాల్, ఇమ్యునైజేషన్ అధికారి సాజిదా, ప్రోగ్రాం ఆఫీసర్ సనా, జీజీహెచ్ సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్‌ఎంవో నవీన ఉన్నారు.


