ప్రాణం తీసిన ఈత సరదా.. విద్యార్థి విషాదం! | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఈత సరదా.. విద్యార్థి విషాదం!

Apr 5 2024 1:55 AM | Updated on Apr 5 2024 7:27 AM

- - Sakshi

చెరువులో మునిగి విద్యార్థి మృతి

అల్మాస్‌పూర్‌లో విషాదం..

కరీంనగర్: ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణం తీసింది. ఉన్నతంగా చదువుకొని కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న కొడుకు మృతిచెందడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. బంగారు భవిష్యత్‌ ఉన్న విద్యార్థి మృతి ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది. స్థానికులు తెలిపిన వివరాలు. వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామానికి చెందిన గొల్లేని(ఆలకుంట) లక్ష్మి–వెంకటి దంపతులకు ఇద్దరు కొడుకులు రాజశేఖర్‌, హరికృష్ణ(15), ఒక కూతురు.

రాజశేఖర్‌ దుబాయిలో ఉండగా, హరికృష్ణ ఇటీవలే పదోతరగతి పరీక్షలు రాశాడు. హరికృష్ణ తండ్రి వెంకటి అల్మాస్‌పూర్‌ గ్రామంలో వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని, పంటలు సాగు చేస్తున్నాడు. తండ్రితోపాటు హరికృష్ణ సైతం పొలం వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచి సమీపంలోని రంగంచెరువులో ఈత కొట్టేందుకు ఒంటరిగా వెళ్లాడు. ఈత కొడుతుండగానే ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయాడు. అప్పటి వరకు కళ్ల ముందు తిరిగిన కొడుకు జీవచ్ఛవంగా పడి ఉండడాన్ని చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అందరితో కలివిడిగా ఉంటే హరికృష్ణ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement