హైదరాబాద్‌లో ప్రమాదం.. మల్యాలలో విషాదం! | - | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ప్రమాదం.. మల్యాలలో విషాదం!

Jan 2 2024 12:30 AM | Updated on Jan 2 2024 11:22 AM

- - Sakshi

అరుణ్‌కుమార్‌(ఫైల్‌)

కరీంనగర్: హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలకు చెందిన యువకుడు మృతిచెందాడు. కొత్త సంవత్సరం రోజున గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. మల్యాలకు చెందిన నేదూరి అరుణ్‌కుమార్‌(28) అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కులాంతర వివాహం కావడంతో నాలుగేళ్ల క్రితమే గ్రామాన్ని వదిలి హైదరాబాద్‌లో ఉంటున్నారు. జీవనోపాధి కోసం పాల ప్యాకెట్ల వ్యాపారం చేస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున మోటారుసైకిల్‌పై షాపునకు వెళ్తుండగా కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరుణ్‌కుమార్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి తల్లిదండ్రులు చంద్రయ్య, లక్ష్మీనర్సవ్వ, భార్య అనిత ఉన్నారు.

ఇవి చ‌ద‌వండి: తాను నడుపుతున్న లారీ.. త‌న‌కే మృత్యు శకటమై..

Advertisement
 
Advertisement
Advertisement