తాను నడుపుతున్న లారీ.. త‌న‌కే మృత్యు శకటమై.. | - | Sakshi
Sakshi News home page

తాను నడుపుతున్న లారీ.. త‌న‌కే మృత్యు శకటమై..

Jan 2 2024 12:30 AM | Updated on Jan 2 2024 11:13 AM

- - Sakshi

కరీంనగర్: గోదావరిఖని టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి గోదావరిఖని–మంథని ప్రధాన రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌ ఎండీ మన్సూర్‌ ఆలం(48) దుర్మరణం చెందాడు. తాను నడుపుతున్న లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. గోదావరిఖని టూటౌన్‌ పోలీసుల కథనం ప్రకారం.. జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన మన్సూర్‌ ఆలం భూపాలపల్లిలో నివాసం ఉంటున్నాడు. లారీ నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు.

సోమవారం ఉదయం ఓసీపీ–3 సీహెచ్‌పీ వద్ద బొగ్గు డంప్‌చేసి గోదావరిఖని నుంచి భూపాలపల్లి వైపు వెళ్తున్నాడు. ఈక్రమంలో రామగిరి మండలం సుందిళ్ల గ్రామం వద్ద ముందు వెళ్తున్న లారీ బ్రేకులు ఆగిపోయాయి. దీన్ని గమనించని డ్రైవర్‌ మన్సూర్‌ ఆలం లారీ ఆపలేదు. దీంతో ముందు ఉన్న మరోలారీని ఢీకొట్టుకున్నాడు. ఈప్రమాదంలో మన్సూర్‌ ఆలం క్యాబిన్‌ నుంచి కిందపడ్డాడు. తాను నడుపుతున్న లారీ కిందనే పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఇవి చ‌ద‌వండి: మాటామాట పెరిగి తలపై రాడ్‌తో దారుణంగా..

Advertisement
 
Advertisement
Advertisement