Telangana Crime News: అత్తింటివారే హింసించి, ఉరేసి చంపారని.. తల్లి ఫిర్యాదు..
Sakshi News home page

అత్తింటివారే హింసించి, ఉరేసి చంపారని.. తల్లి ఫిర్యాదు..

Sep 7 2023 1:38 AM | Updated on Sep 7 2023 9:47 AM

- - Sakshi

కరీంనగర్‌: కరీంనగర్‌లోని వివేకానందపురి కాలనీలో నివాసముంటున్న ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు త్రీటౌన్‌ పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. రామగుండం మండలంలోని వీర్లపల్లికి చెందిన వరలక్ష్మి, గట్టెపల్లికి చెందిన సూత్రాల వరుణ్‌కుమార్‌లకు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం కరీంనగర్‌లోని వివేకానందపురి కాలనీలో నివాసం ఉంటున్నారు.

ఈ దంపతులకు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. వరుణ్‌కుమార్‌ మద్యానికి బానిసై, అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు తల్లిగారింటి నుంచి డబ్బులు, ఆస్తులు తీసుకురావాలని తన కుటుంబసభ్యులతో కలిసి భార్య వరలక్ష్మిని వేధించసాగాడు. ఈ విషయాన్ని ఆమె తరచూ పుట్టింటివారికి చెప్పుకొని, బాధపడేది. మంగళవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రించిన తర్వాత ఉరేసుకుంది. కాగా, తమ కూతుర్ని ఆమె భర్త వరుణ్‌కుమార్‌, అతని కుటుంబసభ్యులు హింసించి, ఉరేసి చంపారని మృతురాలి తల్లి పూల జయమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement