ఉత్సాహంగా ‘సాక్షి స్పెల్‌ బీ’ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ‘సాక్షి స్పెల్‌ బీ’ పరీక్షలు

Oct 31 2026 6:14 AM | Updated on Oct 31 2026 6:14 AM

● ప్రతిభ చాటిన విద్యార్థులు

● ప్రజెంటింగ్‌ స్పాన్సర్‌గా ‘డ్యూక్స్‌ వాఫీ’, అసోసియేట్‌ స్పాన్సర్‌గా

‘ట్రిప్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌’

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల్లో శుక్రవారం ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన సాక్షి స్పెల్‌ బీ పరీక్షలు ఉత్సాహభరితంగా జరిగాయి. ఈ పోటీలకు ప్రజెంటింగ్‌ స్పాన్సర్‌గా ‘డ్యూక్స్‌ వాఫీ’, అసోసియేట్‌ స్పాన్సర్‌గా రాజమండ్రికి చెందిన ‘ట్రిప్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌’ వ్యవహరించాయి. జిల్లా కేంద్రంలోని ఎస్‌పీఆర్‌ పాఠశాలతో పాటు పలు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాక్షి బ్రాంచ్‌ మేనేజర్‌ నర్సింహారెడ్డి హాజరయ్యారు. ఆయా పాఠశాలల నుంచి సుమారు 300 మందికి పైగా విద్యార్థులు ఎంతో ఆసక్తితో పరీక్షకు హాజరై తమ ప్రతిభను చాటారు. విద్యార్థి దశ నుంచే ఇలాంటి ప్రతిభా పోటీల్లో పాల్గొనడం వల్ల ఆత్మవిశ్వాసం, ఆంగ్ల భాషపై పట్టు పెరుగుతాయని బ్రాంచ్‌ మేనేజర్‌ తెలిపారు. విద్యార్థులకు ఇలాంటి పరీక్షలు చాలా అవసరమని ఎస్పీఆర్‌ పాఠశాల కరస్పాండెంట్‌ కొమిరెడ్డి మారుతి తెలిపారు. కార్యక్రమాల్లో ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement