కేజీబీవీ నుంచి విద్యార్థినుల అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీ నుంచి విద్యార్థినుల అదృశ్యం

Oct 31 2026 6:20 AM | Updated on Oct 31 2026 6:20 AM

కేజీబీవీ నుంచి విద్యార్థినుల అదృశ్యం

● పాఠశాల ప్రహరీ దూకి బయటికి..

● గంటల వ్యవధిలో పాఠశాల సిబ్బందికి

అప్పగించిన పోలీసులు

నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంనుంచి పదో తరగతి విద్యార్థులు ముగ్గురు అదృశ్యమైన ఘటన శుక్రవారం స్థానికంగా కలకలం రేపింది. ముగ్గురు విద్యార్థినులు ప్రహరీ దూకి పారిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రిన్సిపాల్‌ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎస్సై భార్గవ్‌గౌడ్‌ విచారణ చేపట్టారు. ముగ్గురు విద్యార్థులు ఆటోలో ఎల్లారెడ్డివైపు వెళ్లారని, అందులో ఒకరు ఎల్లారెడ్డి మండలం మాచాపూర్‌లోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిందని గుర్తించారు. మరో ఇద్దరు ఎల్లారెడ్డిలో ఆర్టీసీ బస్సు ఎక్కి హైదరాబాద్‌ సమీపంలోని సురారంలో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్తున్నారని తెలుసుకుని జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించి, హైదరాబాద్‌ వైపు బయలుదేరారు. జీడిమెట్లలో పోలీసులు ఇద్దరు విద్యార్థినులను బస్సులో నుంచి దింపి, అక్కడికి చేరుకున్న నాగిరెడ్డిపేట పోలీసులకు అప్పగించారు. అనంతరం నాగిరెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌లో స్థానిక ఎంఈవో వెంకట్‌రెడ్డి సమక్షంలో విద్యార్థినులను ఎస్సై భార్గవ్‌గౌడ్‌ కస్తూర్బా పాఠశాల సిబ్బందికి అప్పగించారు. జీసీడీవో సుకన్య నాగిరెడ్డిపేట కేజీబీవీకి చేరుకొని విద్యార్థినుల వివరాలు సేకరించారు. పాఠశాలలో ఉండి చక్కగా చదువుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement