ఓట్ల తొలగింపుపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం | - | Sakshi
Sakshi News home page

ఓట్ల తొలగింపుపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం

Oct 31 2026 6:20 AM | Updated on Oct 31 2026 6:20 AM

● బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

ఇంద్రసేనారెడ్డి

కామారెడ్డి టౌన్‌ : దేశంలో, రాష్ట్రంలో సర్‌ ప్రక్రియపై ప్రతిపక్షాలు కావాలనే తప్పుడు సమాచారంతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్‌, ఇతర పార్టీలు విషప్రచారం చేస్తున్నాయన్నారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు 13 కోట్ల ఓట్ల తొలగింపులో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. తొలగింపునకు గురైన ఓట్లలో ప్రధానంగా శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లినవారు 6.3 కోట్ల మంది ఉన్నారని, ఇళ్ల వద్ద అందుబాటులో లేనివారు, తాళాలు వేసి ఉన్నవారు 3 కోట్లు, మరణించిన ఓటర్లు సుమారు 3 కోట్లు, రెండుచోట్ల పేర్లు నమోదైన డూప్లికేట్‌ ఓటర్లు మరో కోటి వరకు ఉన్నారని వివరించారు. ఎవరూ ఓటు తొలగింపుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఓటు హక్కు లేనివారు లేదా మార్పులు కోరేవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఓటరు జాబితా ప్రక్షాళన కోసం బీఎల్వోలు, ఎన్నికల సిబ్బంది క్షేత్రస్థాయిలో ఎంతో శ్రమిస్తుంటే ప్రతిపక్షాలు ఎలాంటి ఆధారాలు చూపకుండా నిరాధార ఆరోపణలు చేస్తూ వ్యవస్థలను కించపరుస్తున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్య ప్రక్రియపై లేనిపోని అనుమానాలు సృష్టించడం సరికాదని హితవు పలికారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, కౌన్సిలర్లు శ్రీకాంత్‌, వంశి, భాను, నాయకులు నరేందర్‌, వెంకటేష్‌, రాజ్‌గోపాల్‌, భూమేష్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement