నిజాంసాగర్/సదాశివనగర్: నిజాంసాగర్ మండలంలోని మాగి, సదాశివనగర్ మండలంలోని అడ్లూర్‌ఎల్లారెడ్డిలలోగల గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీలలో శుక్రవారం చెరుకు క్రషింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్‌రావు మాట్లాడుతూ ఈ సీజన్‌లో 4 లక్షల టన్నుల చెరుకు గానుగ ఆడించాలన్నది లక్ష్యమన్నారు. టన్ను చెరుకుకు రూ. 3,917 చొప్పున మద్దతు ధరను చెల్లిస్తున్నామన్నారు. పర్మిట్ ఉన్న చెరుకు రైతులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. కార్యక్రమాలలో సీడీసీ చైర్మన్ శాదుల్లా, జీఎంలు సుబ్బారావు, వీరరాజు, ఉమామహేశ్వరరావు, కుటుంబరావు, మేనేజర్లు మాలకొండయ్య, వేంకటేశ్వర్‌రావు, వెంగళ్‌రెడ్డి, సుబ్బారెడ్డి, సుగుణభూషన్‌రావు, గోవింద్, రెడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.
దోమకొండ: రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ టోర్నీల్లో పాల్గొనే 18 ఏళ్లలోపు బాల బాలికల ఎంపిక పోటీలను శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఇందులో ప్రతిభ చూపినవారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వీరు నవంబర్ 1న హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో ఎంఈవో విజయ్‌కుమార్, పాఠశాల హెచ్‌ఎం రాధాలక్ష్మి, ఉపాధ్యాయులు వెంకట్‌రెడ్డి, బాపురెడ్డి, బాలకిషన్, సౌజన్య, నిర్మల్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపికై ంది వీరే..
బాలుర విభాగం: మద్నుర్ గురుకుల పాఠశాల విద్యార్థులు మధు, జ్ఞానేశ్వర్, కామారెడ్డికి చెందిన రాంచరణ్, దోమకొండ బాలుర పాఠశాలకు చెందిన సాత్విక్.
బాలికల విభాగం: భిక్కనూరు మండలం బీటీఎస్‌లోని జ్యోతీబాపూలే గురుకుల విద్యార్థిను లు పావని, వైష్ణవి, దోమకొండ గురుకుల పా ఠశాల విద్యార్థి ప్రణతి, దోమకొండ ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థి కారుణ్య.
కామారెడ్డి అర్బన్: పీఎం సూర్యఘర్ పథకం కింద ఇంటి పైకప్పుపై సోలార్ విద్యుత్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకు వారంరోజుల్లో నెట్ మీటర్లను అమరుస్తున్నామని విద్యుత్ ఎస్‌ఈ సాలియానాయక్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి 937 దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 501 ప్లాంట్లు ఇన్‌స్టాలేషన్ చేయగా 452 నెట్ మీటర్ల కనెక్షన్ ఇచ్చామని, 49 పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయిన మిగులు విద్యుత్‌కు ఎన్పీడీసీఎల్ యూనిట్‌కు రూ. 2.57 చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఇంటి సోలార్ ప్లాంట్ల ద్వారా ఈ సంవత్సరంలో 90వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యిందన్నారు. పని పూర్తి అయిఆ నెట్ మీటర్ల రాక ఇబ్బందులు ఉంటే వినియోగదారులు సంబంధిత విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
కామారెడ్డి టౌన్ : జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో వెంకటి హెచ్చరించారు. శుక్రవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో పీహెచ్‌సీ వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, సూపర్‌వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గర్భిణుల వివరాలను మొదటి త్రైమాసికంలోనే ఆన్‌లైన్ పోర్టల్‌లో వంద శాతం నమోదు చేయాలని, హైరిస్క్ కేసులను గుర్తించి ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు జరిగేలా చూడాలని ఆదేశించారు. చిన్నారుల వ్యాక్సినేషన్‌లో డ్రాప్ అవుట్స్ లేకుండా చూడాలన్నారు. 30 ఏళ్లు పైబడిన వారికి ఎన్‌సీడీ స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేయడంతో పాటు, క్షయ నిర్మూలన, సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులు నిరంతరం సబ్ సెంటర్లు, పల్లె దవాఖానాలను తనిఖీ చేస్తూ సిబ్బందికి మార్గదర్శనం చేయాలని ఆదేశించారు. సమావేశంలో వైద్యాధికారులు, సీహెచ్‌వోలు, సిబ్బంది పాల్గొన్నారు.


