‘జలసిరి’ పనులు..
మౌలిక సదుపాయాల కల్పనకు...
పశువుల మేత కొరత రాకుండా..
‘‘ఎల్‌నినో కారణంగా తలెత్తిన కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం. గ్రామీణ ప్రాంత కూలీలందరికీ వీబీజీ రాంజీ ద్వారా చేతినిండా పని కల్పిస్తాం. ఇందులోనూ భూగర్భ జలాల పెంపు పనులకు ప్రాధాన్యత ఇస్తాం’’ అని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి(డీఆర్‌డీవో) దామోదర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎల్‌నినో కారణంగా నెలకొన్న పరిస్థితులు, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలపై శుక్రవారం ‘సాక్షి’ డీఆర్‌డీవో దామోదర్‌రెడ్డిని ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలు..
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
జిల్లాలో వీబీజీ రాంజీ పథకం ద్వారా ఊరూరా ఉపాధి పనులు జోరుగా నడుస్తున్నాయి. ఈ పథకంలో భాగంగా జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు 29.35 లక్షల పనిదినాలు కల్పించాం. కూలీలకు రూ.75.88 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. ప్రస్తుతం సరాసరిన గ్రామనికి 32 మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. దాన్ని 45 వరకు పెంచడం ద్వారా మార్చి ఆఖరునాటికి మరో 43 లక్షల పని దినాలు కల్పిస్తాం. జిల్లాలో 1,35,912 జాబ్ కార్డుల ద్వారా 2,15,329 మంది కూలీలు ఉపాధి పొందుతారు.
‘ఇందిరమ్మ’లో 4.50 లక్షల పనిదినాలు..
ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే వారికీ ఈ పథకంలో ఉపాధి చూపుతున్నాం. ఒక్కో ఇంటికి 90 రోజుల పని దినాలు కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు నిర్మించుకున్న ఇళ్లకు 4.50 లక్షల పనిదినాలు కల్పించాం. కొత్తగా మంజూరైన ఇళ్లకు కూడా పని కల్పించడం జరుగుతుంది.
పశువుల తొట్ల నిర్మాణం...
గ్రామాల్లో పశువులకోసం నీటి తొట్ల నిర్మాణాన్ని కూడా మెటల్ కాంపోనెంట్ కింద చేపడుతున్నాం. ఒక్కో నీటి తొట్టికి రూ.35 వేలు ఇస్తాం. 5 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు, రెండు ఫీట్ల ఎత్తులో నిర్మించాల్సి ఉంటుంది. అలాగే గొర్రెల కోసం కూడా నీటి తొట్టెల నిర్మాణం చేపట్టవచ్చు. 10 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు, రెండు ఫీట్ల ఎత్తులో నిర్మించడానికి రూ.43 వేలు మంజూరు చేస్తాం.
ఉపాధి కూలీల ద్వారా చేపట్టే పనుల్లో భూగర్భజలాల వృద్ధికి సంబంధించిన పనులకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇంకుడు గుంతలు, పంట కుంటలు, ఊట చెరువులు వంటివి చేపడతాం. ఇంటింటికీ ఇంకుడు గుంత నిర్మించుకోవడం ద్వారా భూగర్భజలాల వృద్ధికి దోహదపడవచ్చు. ఊట చెరువు కూడా నిర్మించుకోవచ్చు. జిల్లాలో 25 వేల సోక్‌పిట్స్ నిర్మించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నాం.
వీబీజీ రాంజీ పథకంలో భాగంగా గ్రామా ల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి న పనులు కూడా చేపడతాం. కొత్త పంచాయతీల్లో పంచాయతీ భవనాలు, అలాగే వీవో భవనాల నిర్మాణాలు చేపడుతున్నాం. వీవో భవనాలకు రూ.10 లక్షల వరకు, టాయ్‌లెట్స్‌కు రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నాం. ఇంకా ప్రజలకు ఉపయోగపడే 70 రకాల పనులు చేపడతాం.
ఎల్‌నినో నేపథ్యంలో పశువులకు గ్రాసం కొ రత తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా గడ్డి పెంచేందుకు ప్రోత్సాహ కం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాబ్ కా ర్డు ఉన్న రైతులకు ఎకరం గడ్డి పెంచడానికి దున్న కం, విత్తనం, ఇతర అవసరాలకు రూ.14 వేలు చెల్లిస్తాం. తద్వారా గ్రాసం సమస్య రాకుండా చూ డాలన్నది దీని ఉద్దేశం. ముందకు వచ్చేవారు స్థానికంగా పంచాయతీ సెక్రెటరీకి తమ జాబ్‌కార్డు, ఆధార్ కార్డులను అందించి పంచాయతీ ద్వారా మండల అధికారులకు అప్పగిస్తే జాబితా రూపొందించి వారికి సలహాలు సూచనలు ఇస్తాం.
ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు
సన్నద్ధంగా ఉన్నాం
‘వీబీజీ రాంజీ’లో భూగర్భజలాల
పెంపు పనులకు ప్రాధాన్యత
పశుగ్రాసం పెంచడానికి ప్రోత్సాహం
‘సాక్షి’ ఇంటర్వ్యూలో
డీఆర్‌డీవో దామోదర్‌రెడ్డి


