విద్యార్థుల ప్రతిభను పెంచడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ప్రతిభను పెంచడమే లక్ష్యం

Oct 31 2026 6:14 AM | Updated on Oct 31 2026 6:14 AM

విద్యార్థుల ప్రతిభను పెంచడమే లక్ష్యం జోయాలుక్కాస్‌ బిగ్‌ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ ప్రారంభం

రామారెడ్డి: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను పెంచడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో మల్లికార్జున్‌ అన్నారు. శుక్రవారం ‘పీఎం శ్రీ’ జిల్లా ఉన్నత పాఠశాల రెడ్డిపేట, స్కూల్‌ తండాలోని ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలల్లోని పలు విభాగాలను పరిశీలించి, ఉపాధ్యాయులు, విద్యార్థులకు పలు సూచనలు చేశారు. డీఈవో మాట్లాడుతూ... పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. హెచ్‌ఎంలు, ఉపాధ్యాయలు తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్‌ హాల్‌లో ప్రముఖ నగల సంస్థ జోయాలుక్కాస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బిగ్‌ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ కమ్‌ సేల్‌ను మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ కాసర్ల గోదావరి శుక్రవారం ప్రారంభించారు. వినియోగదారులకు సరికొత్త, వినూత్న డిజైన్లతో కూడిన ఆభరణాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జోయాలుక్కాస్‌ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

బలిపీఠం ధ్వంసం

బోధన్‌ రూరల్‌: మండలంలోని అమ్ధాపూర్‌ గ్రామంలోని జగజ్జనని మహంకాళి అమ్మవారి మందిరం సమీపంలో ఉన్న బలిపీఠాన్ని గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి ధ్వంసం చేశారు. ఈ ఘటనపై గ్రామస్తులు శుక్రవారం బోధన్‌ రూరల్‌ ఎస్సై రాజశేఖర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. బలిపీఠాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను గుర్తించి, వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను గ్రామస్తులు కోరారు. బీజేపీ మండల అధ్యక్షుడు సిర్ప సుదర్శన్‌ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement