ఎల్లారెడ్డి/ భిక్కనూరు/ బీబీపేట: ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇందిరమ్మ గృహాలకు మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ఎల్లారెడ్డి, పోసన్పల్లి, గండి మాసానిపేట, కొత్తపల్లి గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించారు. అనంతరం ఇంటి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, కౌన్సిలర్లు చంద్రయ్య, తిరుపతి, దశరథం, సిద్ధి శ్రీధర్, నాయకులు ప్రశాంత్ గౌడ్, రాములు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. భిక్కనూరు మండల కేంద్రంలో పలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు సర్పంచ్ రేఖ, రామేశ్వర్పల్లిలో సర్పంచ్ చేపూరి రాణి భూమి పూజ చేశారు. కార్యక్రమాల్లో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, ఎంపీడీవో సవితరెడ్డి, ఉపసర్పంచులు దుంపల మోహన్‌రెడ్డి, వినోద్‌గౌడ్, వీడీసీ అధ్యక్షుడు మద్ది సూర్యకాంత్‌రెడ్డి, నేతలు రాజబాబుగౌడ్, సుదర్శన్, లింబాద్రి, గంగళ్ల భూమయ్య, దయాకర్‌రెడ్డి, కిరణ్, మైపాల్‌రెడ్డి, రాంరెడ్డి పాల్గొన్నారు. బీబీపేట మండలంలోని యాడారంలో లబ్ధిదారు కుమ్మరి నవీన్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి కావడంతో గృహప్రవేశం చేశారు. సర్పంచ్ గొబ్బూరి సుధారాణి లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ సుతారి రమేశ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజ్ గౌడ్, నాయకు లు శ్రావణ్ కుమార్, భూమాగౌడ్, అనిల్ గౌడ్, వెంకట్ రావు, తిరుపతి రెడ్డి, నాగరాజు, ఆరుట్ల రాజు, వెంకటేశం, శ్రావణ్ గౌడ్, సాయినా థ్, సిద్ధా గౌడ్, పిడుగు స్వామి, దుర్గారాజ్ పాల్గొన్నారు.


