● భార్యతోపాటు ఇద్దరు నిందితుల అరెస్టు
● వివరాలు వెల్లడించిన డీఎస్పీ విఠల్‌రెడ్డి
బాన్సువాడ: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉ న్నాడని భర్తను హత్య చేయించింది ఓ భార్య. ఈ ఘ టనలో భార్యతోపాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. బాన్సువాడ పీఎస్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ విఠల్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామానికి చెందిన గుమ్మడి కాశీరాం (26) అనే వ్యక్తికి, అదే గ్రా మానికి చెందిన చింతకింది రాముకు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంలో కాశీ రాం, రాము మధ్య గొడవలు జరిగాయి. కాశీరాం భార్యకు వరుసకు మరిది అయిన పసుపుల సంతోష్‌తో వివాహేత సంబంధం ఉంది. దీంతో కాశీరాంను చంపేస్తే అటు రాముకు, ఇటు సంతో ష్కు అడ్డులేకుండా పోతుందని ముగ్గురు పథకం వేశారు. ఈక్రమంలో ఈనెల 22న రాత్రి మృతుడు కాశీరాం, నిందితులు రాము, సంతోష్ కలిసి మద్యం సేవించారు. అనంతరం రాము నైలాన్ తాడుతో కాశీరాం మెడకు గట్టిగా బిగించగా సంతోష్ సహకరించాడు. కాశీరాం మృతి చెందగానే స్థానిక చెరువులో మృతదేహాన్ని పడేశారు. మరుసటి రోజు చెరువులో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదికలో మృతుడిది హత్యగా తేల్చారు. విచారణ చేపట్టిన పోలీసులు మృతుడి భార్య సవిత, ఆమెకు వరుసకు మరిది అయిన సంతోష్, మరో వ్యక్తి రామును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు కాశీరాంను హత్య చేసినట్లు అంగీకరించారు. వారి నుంచి ఫోన్లు, నైలాన్ తాడును స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ అన్నారు. కేసును చేధించిన సీఐ శ్రీధర్, కానిస్టేబుళ్లు సాయికుమార్, పృధ్వీకుమార్, పాండురంగ, సుదర్శన్రావుల ను జిల్లా ఎస్పీ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు.


