కామారెడ్డి టౌన్ : దళితులు, బీసీలు, గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూముల విషయంలో పేద రైతులను అటవీ అధికారులు శత్రువులుగా చూస్తున్నారన్నారు. రాజంపేట, మాచారెడ్డి, గాంధారి, లింగంపేట్ మండలాల్లో రోడ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అడ్డుకుంటూ అభివృద్ధి నిరోధకులుగా మారారన్నారు. పేదలపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో నాయకులు కొత్త నర్సింలు, ముదాం అరుణ్‌లు పాల్గొన్నారు.


