కామారెడ్డి టౌన్ : ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) మహాధర్నాను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు భునేకర్ సంతోష్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్ పీఆర్సీ నివేదిక విడుదల, 51 శాతం ఫిట్‌మెంట్, 6 డీఏల మంజూరు, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు హాజరుకావాలన్నారు.


