మునుగుతున్న పంటలు | - | Sakshi
Sakshi News home page

మునుగుతున్న పంటలు

Aug 1 2026 12:54 AM | Updated on Aug 1 2026 12:54 AM

మునుగుతున్న పంటలు

ఆక్రమణకు గురైన డోంగ్లీ కాలువ

ఏటా ఇబ్బందులు

పడుతున్న రైతులు

మద్నూర్‌(జుక్కల్‌): కొన్ని రోజులుగా కురుస్తున్న వానలతో డోంగ్లీ శివారులోని సుమారు 200 ఎకరాల వరి, సోయాబీన్‌ పంటలు నీట మునిగాయి. డోంగ్లీ నుంచి కుర్లా వెళ్లే ప్రధాన రహదారిపై గల చిన్న వాగుకు రెండు వైపులా నుంచి డోంగ్లీకాలువ ఆక్రమణలకు గురై చిన్నగా మారిందని రైతులు ఆరోపిస్తున్నారు. భారీ వర్షాలు కురిసిన సమయంలో చుట్టూ పక్కల ప్రాంతాల నుంచి వరద నీరు కాలువను ముంచేస్తూ పక్కన ఉన్న వ్యవసాయ భూముల్లోని పంటలను ముంచెత్తుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో సుమారు రెండు వందల ఎకరాల సోయాబీన్‌, పత్తి పంటలు సాగు చేశామని ఏటా వర్షాల సమయంలో పంట నష్టం జరుగుతుందని అధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement