సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

Aug 1 2026 12:54 AM | Updated on Aug 1 2026 12:54 AM

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలి ఎమ్మెల్యే కూతురు పెళ్లికి సీఎంకు ఆహ్వానం ఏబీవీపీ సభ్యత్వ నమోదు

బాన్సువాడ : వర్షాకాలం నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యులు అప్రమత్తంగా ఉండి పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని పాత బాన్సువాడలోని బస్తీ దావాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి రోజు ఆస్పత్రికి వచ్చే రోగుల వివరాలపై ఆరా తీశారు. మందుల వివరాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను ప్రత్యక్షంగా పరిశీలించి సిబ్బంది పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ గంగాధర్‌, కాంగ్రెస్‌ నాయకులు కృష్ణరెడ్డి, గడుమల లింగం, కనుకుట్ల రాజు, వెంకట్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, జలపతిరెడ్డి, అశోక్‌రెడ్డి, దాసరి శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

తాడ్వాయి(ఎల్లారెడ్డి): విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడానికి ఉపాధ్యాయులు తమ వంతు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్‌ అన్నారు. మండలంలోని కృష్ణాజీవాడిలో గల ఉన్నత, ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. పదో తరగతి గదిలో విద్యార్థిమణికంత్‌ను ప్రశ్నలను అడిగి సమాధానాలను రాబాట్టారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడానికి సలహాలను, సూచనలను తెలియజేశారు. మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామస్వామి., పాఠశాల ఉపాధ్యాయులు గిర్మా బోయి, శ్వేత, సుజాత, శ్రీహరి, బాబురావు, సంధ్యారాణి, సరిత, రాజారెడ్డి , ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగుబాయి , ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం మండలంలోని చిట్యాల ఉన్నత పాఠశాలను కూడా సందర్శించారు.

నిజాంసాగర్‌(జుక్కల్‌): హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శుక్రవారం జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుటుంబ సమేతంగా కలిశారు. ఆగస్టు నెలలో తమ కూతురు జోనిట వివాహానికి హాజరు కావాలని సీఎంకు ఎమ్మెల్యే దంపతులు పెళ్లి పత్రికను అందిస్తూ ఆహ్వానించారు.

బాన్సువాడ : ఏబీవీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం బాన్సువాడలోని కళాశాలలు, పాఠశాలల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందూర్‌ బాగ్‌ కన్వీనర్‌ శశింధర్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తితో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఏబీవీపీ సభ్యత్వ నమోదు చేపడుతున్నామన్నారు.కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు మోహన్‌, అభిలాష్‌, పవన్‌, పండరి, ప్రణీత్‌, సోనూ, అభిలాష, ప్రేమ్‌, అరవింద్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement