సోలార్ సిస్టంతో వరికోత యంత్రం
చిన్నకారు, పేద రైతులు వరి కోత కోసం వికారాబాద్ జిల్లా కొత్తపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన విద్యార్థిని బి.సాయి అర్చన సోలార్ సిస్టంతో వరికొత యంత్రాన్ని తయారు చేసింది. రెండు ఎకరాలలోపు రైతులు సులువుగా ఈ యంత్రం సహాయంతో వరివడ్లను తీసుకుంటుంది. మిగిలిన వరి గడ్డి వృథా కాకుండా పశువులకు కోసుకోవచ్చని వివరించింది. రూ.5 వేల ఖర్చుతో రైతులకు అందజేస్తే భారీ కోత మిషన్లకు బదులుగా ఈ యంత్రాన్ని వినియోగించి ఖర్చు తగ్గించుకోవచ్చని తెలిపింది. జి. రవికుమార్ గైడ్ టీచర్‌గా వ్యవహరిస్తున్నారు.


