మతసామరస్యానికి ప్రతీక
పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయ సమీపంలో గురువారం జగద్గురు శ్రీమద్ రామానందాచార్య నరేంద్రాచార్యజీ సంస్థాన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. 54 మంది యువకులు రక్తదానం చేశారు. పలువురు ముస్లింలు రక్తదానం చేసి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. మైనార్టీ యూత్ మండల అధ్యక్షుడు అఫ్రోజ్ దస్తగిర్, రోషన్ అలీ, గౌస్ తదితరులు పాల్గొన్నారు.
రామారెడ్డి: మండలంలోని రంగంపేట్ రైల్వేగేట్ సమీపంలో గురువారం రాత్రి ఆటో బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. పోసానిపేట నుంచి కామారెడ్డి వెళ్తున్న ఆటో రంగంపేట రైల్వే గేట్ వద్ద బోల్తా కొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ గణేశ్(34)ను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.


