దొంగ బుద్ధి మారలే..
ఆర్మూర్ టౌన్: పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన వ్యక్తిలో మార్పు రాలేదు. జైలు నుంచి విడుదలైన నెలలోనే చేతివాటం ప్రదర్శించి పోలీసులకు చిక్కాడు. ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్మూర్ పట్టణానికి చెందిన దాసరి అనిల్ గతంలో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లాడు. నెల క్రితం విడుదలైన అనిల్ పట్టణంలోని పంత్ రోడ్, రాంనగర్, హౌసింగ్ బోర్డు కాలనీల్లో చోరీకి పాల్పడ్డాడు. గురువారం ఉదయం ఆర్మూర్ బస్టాండ్ వద్ద అపహరించిన బైక్‌పై వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. విచారణ అనంతరం నిందితుడి నుంచి ఒక బంగారు గొలుసు, ఒక ఉంగరం, 10 గ్రాముల వెండి, బైక్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును ఛేదించిన కానిస్టేబుళ్లు కిరణ్‌కుమార్, హరీశ్‌లను ఎస్‌హెచ్‌వో అభినందించారు.
● జైలు నుంచి విడుదలైనా మారని తీరు
● చోరీ కేసులో ఒకరి రిమాండ్


