గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● సీతారాంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన
దోమకొండ: ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంతో పాటు సీతారాంపల్లిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన పరిశీలించారు. నిర్మాణాల పురోగతి గురించి తెలుసుకున్నారు. నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. లబ్ధిదారులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట హౌసింగ్ పీడీ విజయపాల్‌రెడ్డి, తహసీల్దార్ సుధాకర్, మండల ప్రత్యేకాధికారి జ్యోతి, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, సర్పంచ్‌లు నర్సయ్య, భానుశ్రీ తదితరులున్నారు.
కేజీబీవీ సందర్శన..
సీతారాంపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడారు. విద్యాలయంలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, భోజనం నాణ్యత గురించి తెలుసుకున్నారు. కేజీబీవీ ఆవరణలో పెండింగ్‌లో ఉన్న సంపు నిర్మాణ పనులను పరిశీలించారు. సంపు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ప్రిన్సిపల్ మంగమ్మ, మండల ప్రత్యేకాధికారి జ్యోతి, అధికారులు ఉన్నారు.


