కవులు ప్రజల్లో చైతన్యం తెచ్చారు
● రచనలతో సమాజంలో మార్పు..
● గడీకోట సమ్మేళనంలో వక్తలు
దోమకొండ: తెలంగాణ కవులు తమ రచనలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం పూర్వ శాఽఖాధిపతి కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, తెయూ వీసీ యాదగిరిరావు పేర్కొన్నారు. దోమకొండ గడికోటలో ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆధునిక సాహిత్యం –సమాలోచన అంశంపై నిర్వహించిన సమ్మేళనానికి వారు ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కవులు, గాయకులు తమ ఆటలు, పాటలు, రచనలతో సమాజంలో మార్పు తీసుకువచ్చారన్నారు. సంస్థానాల పాలకుల సాహితీ సేవలను ప్రశంసించారు. వెలుగులోకి వచ్చిన సాహిత్యం ప్రజల జీవన విధానాన్ని, వారి ఆలోచనలను ప్రతిబింబిస్తుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. సాహితీ సృష్టికర్తలు సామాజిక బాధ్యతతో రచనలు చేయాలని సూచించారు. అనంతరం పలువురు కవులు తెలంగాణ సాహిత్యానికి గతంలో రాజులు, ప్రభుత్వాలు చేసిన సేవలను గుర్తుచేశారు. కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక సంచాలకులు నర్సింహారెడ్డి, పలు యూనివర్సిటీల ప్రస్తుత, పూర్వ శాఖాధ్యక్షులు పులికొండ సుబ్బాచారి, సాగి కమలాకర్‌శర్మ, గంగాధర్, కవులు లక్ష్మణ్‌రావ్, అంజనేయరాజు, వడ్ల శంకరయ్య, శ్రీధర్‌బాబు, కరిమిండ్ల లావణ్య, అట్టెం దత్తయ్య, రాజిరెడ్డి మహేందర్‌రెడ్డి, లక్ష్మణ్ చక్రవర్తి, కాసర్ల నరేష్, సుజాత, సుదర్శనం రాజయ్య, పద్మారాణి, కందాల పద్మావతి, చింతల శ్రీనివాస్‌గుప్తా, రమణాచారి, సర్పంచ్ ఐరేని నర్సయ్య, మాజీ జెడ్పీటీసీ తిర్మల్‌గౌడ్, గడికోట వారసులు కామినేని అనిల్‌కుమార్, ట్రస్టు మేనేజర్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.
కవులు ప్రజల్లో చైతన్యం తెచ్చారు


