కూలీకి వెళ్లొస్తూ..
● రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీ మృతి
బాన్సువాడ రూరల్: మండలంలోని బీర్కూర్–బాన్సువాడ ప్రధాన రహదారిపై కొల్లూర్ శివారులోని రైస్‌మిల్ వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. బాన్సువాడ మండలం బుడిమి గ్రామానికి చెందిన దినసరి కూలీలు నాగారం గ్రామంలో వరినాట్లు వేసి ఆటోలో తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న చించోలి గ్రామానికి చెందిన ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. ప్రమాదంలో నీరడి రుకుంబాయి (35) తీవ్రగాయాలై అక్కడిక్కకడే మృతి చెందింది. కొనింటి ఆశయ్య, నర్వ భూలక్ష్మికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాన్సువాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


