గనుల్లో ప్రాణాలు కాపాడుకోవడానికి..
బొగ్గు గనుల్లో కార్మికుడిగా పని చేస్తు న్న తన తాతయ్యకు అకస్మాత్తుగా ఆక్సిజన్ అందక తీవ్ర అవస్థకు గురై చావు అంచువరకు వెళ్లి వచ్చిన ఘటనకు చలించిన భద్రా ద్రి కొత్తగూడెంకు చెందిన విద్యార్థిని దివిజారెడ్డి.. పాలి వర్కర్ సేఫ్టీ హెల్మెట్‌ను తయారు చేసింది. అరకిలో ఆక్సిజన్ సిలిండర్ ఉన్న ఈ హెల్మెట్ ధరించి గనుల్లోకి వెళ్లి బొగ్గు తీస్తుండగా ఆక్సిజన్ అందకుంటే ఆటోమేటిక్‌గా ఆక్సిజన్ అందేలా, మిగతా కార్మికులను అప్రమత్తం చేస్తుంది. ప్రాణాలను కాపాడేలా ఈ డివైజ్ తయారు చేసింది. విద్యార్థి తండ్రి మోహన్‌రెడ్డి గైడ్‌గా ఉండటం గమనర్హం.


