భేషరుతుగా క్షమాపణ చెప్పాలి
భిక్కనూరు: మండల కేంద్రంలో ఫార్మా కంపెనీకి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో బుధవారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీంరెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని భిక్కనూరు మండల బీజేపీ మండలాధ్యక్షుడు ఉప్పరి రమేష్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన భిక్కనూరులో మాట్లాడుతూ.. ప్రజలందరూ ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తుంటే బీంరెడ్డి అక్కడకు వచ్చి ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. నేతలు బస్వారెడ్డి, నరేందర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, నర్సింలు, యాదగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.


