సుందరం.. సూర్యోదయం
మద్నూర్(జుక్కల్): ఉదయం పడిపోతున్న ఉష్ణోగ్రతలతో సూర్యుడు ఆలస్యంగా వస్తున్నాడు. ఉదయం సమయంలో సూర్యుడు లేలేత కిరణాలతో ఎర్రగా మారి ఆకట్టుకుంటున్నాడు. మండల కేంద్రానికి సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం ఉదయిస్తున్న సూర్యుడి రూపం సుందరంగా కనిపించింది.
జక్రాన్‌పల్లి: కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు జక్రాన్‌పల్లి ఎస్సై మహేశ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బాలానగర్ గ్రామానికి చెందిన సాయిలు(32) మద్యానికి అలవాటు పడ్డాడు. మంగళవారం మద్యం తాగి ఇంట్లో భార్యతో గొడవపడ్డాడు. దీంతో వారి మధ్య గొడవ జరగడంతో క్షణికావేశంలో గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
సుందరం.. సూర్యోదయం


