అద్దె భవనాల్లో కొనసాగుతున్న పలు కార్యాలయాలు
● కామారెడ్డి జిల్లా కేంద్రంలో సఖి, భరోసా కేంద్రాలు అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాల మధ్య కొనసాగుతున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం కూడా అద్దె భవనంలోనే ఉంది. జిల్లా కేంద్రంలో సగానికిపైగా అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవు.
● బాన్సువాడ డివిజన్ కేంద్రంలో పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయం అద్దె భవనంలో ఉంది. ఇక్కడ సొంత భవనం నిర్మిస్తున్నారు. సబ్‌రిజిస్ట్రార్, కార్మిక శాఖ కార్యాలయాలకూ అద్దె భవనాలే దిక్కయ్యాయి.
● ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో ఎకై ్సజ్ శాఖ, విద్యుత్ శాఖల డివిజనల్ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉన్నాయి. పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయాన్ని ఇటీవల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి మార్చారు. సంక్షేమ హాస్టళ్లు అద్దె భవనాల్లోనే ఉన్నాయి.
● బిచ్కుందలో ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఆదాయం తెచ్చిపెట్టే శాఖలే అయినా సొంత భవనాలకు నిధులు రాకపోవడంతో అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి.
● బీబీపేటలో ఐకేపీ కార్యాలయం అద్దె భవనంలో ఉంది. ఎంపీడీవో, తహసీల్ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. అయితే ఎంపీడీవో కార్యాలయం ఎమ్మార్సీ భవనంలో, తహసీల్ కార్యాలయం సొసైటీ భవనంలో కొనసాగుతోంది.
● నస్రుల్లాబాద్‌లో ఐకేపీ కార్యాలయానికి సొంత భవనం లేదు.
● దోమకొండ మండల కేంద్రంలో ఎకై ్సజ్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది.


