రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మహిళలు, పురుషుల జట్ల ఎంపిక
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి జిల్లా కబడ్డీ అసో సియేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో 72వ జిల్లా స్థాయి మహిళ, పురుష కబడ్డీ జట్ల ఎంపికలు నిర్వహించి 32 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 25 నుంచి 28వరకు కరీంనగర్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి 72వ సీనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి బి.భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఎంపికై న క్రీడాకారుల అభినందన నిర్వహించగా జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వరగౌడ్, టీఎస్ పేటా జిల్లా ప్రధానకార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, డెయిరీ కళాశాల అసిస్టెంట్ ప్రోఫెసర్ ఉమాపతి, వ్యాయామ ఉపాధ్యాయులు, అసోసియేషన్ ప్రతినిధులు వెంకటి, అనిల్‌కుమార్, జగదీష్, నవీన్‌కుమార్, రేణుక, విజయలక్ష్మి, అరుణ, రమ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


