బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్ ప్రారంభం
కామారెడ్డి క్రైం: జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్‌ను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ రద్దీగా ఉండే ప్రాంతాల్లో పిల్లలకు పాలు ఇవ్వడంలో తల్లులకు ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. ప్రతి బస్టాండ్, ఇతర రద్దీ ప్రాంతాల్లో ఇలాంటి ప్రత్యేక క్యాబిన్‌లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


