కొలువుదీరిన పల్లె పాలకులు
ఆ గ్రామాల్లో నిలిచిన ప్రమాణ స్వీకారం..
● బాధ్యతలు స్వీకరించిన
పంచాయతీ పాలకవర్గాలు
● పలుచోట్ల వాయిదా
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పంచాయతీ పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఏడెనిమిది పంచాయతీల్లో మినహా మిగిలిన అన్నిచోట్ల బాధ్యతల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యింది.
జిల్లాలో 532 పంచాయతీలు ఉన్నాయి. ఈనెల 11, 14, 17 తేదీలలో మూడు విడతల్లో ఆయా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. పంచాయతీ పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తొలుత ఈనెల 20 నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే అమావాస్య కారణంగా 22 వ తేదీకి వాయిదా వేశారు. సోమవారం జిల్లాలోని ఆయా పంచాయతీల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అధికారుల ఆధ్వర్యంలో చేపట్టారు. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులందరూ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో సభలు, సమావేశాలు జరిగాయి.
బాన్సువాడ మండలంలో మూడుచోట్ల..
బాన్సువాడ రూరల్ : సోమ్లానాయక్ తండాలో సర్పంచ్ మీరిబాయి అత్త, ఇబ్రాహీంపేట్ తండాలో వార్డు సభ్యుడి కుటుంబ సభ్యుడు మృతిచెందడంతో ఆయా పంచాయతీలలో ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేశారు. దేశాయిపేట్‌లో వ్యక్తిగత కారణాలతో సర్పంచ్ ప్రమాణ స్వీకారానికి బుధవారానికి వాయిదా వేసుకున్నారు. కాగా ఇక్కడ నలుగురు వార్డు సభ్యులు మాత్రం ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్‌తోపాటు మిగిలిన వార్డుమెంబర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
పలు గ్రామాల్లో వివిధ కారణాలతో ప్రమా ణ స్వీకారం నిలిచిపోయింది. ఎల్లారెడ్డి మండ లం సోమార్‌పేట్‌లో ఇటీవల జరిగిన ఘర్షణల నేపథ్యంలో ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేశా రు. మాచారెడ్డి మండలం సోమారంపేట, సో మారంపేట తండా పంచాయతీల పాలకవర్గాలు పంచాయతీ భవనం కోసం ఘర్షణ పడడంతో రెండు గ్రామాలలో ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. మహ్మద్‌నగర్ మండలం గున్కుల్ గ్రామ సర్పంచ్ రమేశ్‌యాదవ్ అయ్యప్ప మాల విరమణ కోసం శబరిమల వెళ్లడంతో అక్కడ ప్రమాణ స్వీకారం నిలిచిపోయింది.


