యాప్‌తో ఎరువుల కొనుగోలు సులభం
గాంధారిలో యాప్‌పై అవగాహన
కల్పిస్తున్న ఏవో రాజలింగం
లింగంపేటలో మాట్లాడుతున్న
ఏవో అనిల్‌కుమార్
లింగంపేట(ఎల్లారెడ్డి): ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ ద్వారా రైతులు సులభంగా ఎరువులు కొనుగోలు చేయవచ్చని మండల వ్యవసాయాధికారి అనిల్‌కుమార్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడారు. రైతులు లైసెన్సులు కలిగిన డీలర్ల వద్ద బుకింగ్ చేసుకున్న 24 గంటల్లో ఎరువులు పొందవచ్చారు. ఆన్‌లైన్‌లో ఎరువుల వివరాలు నమోదై ఉంటాయన్నారు. ఏఈవోలు రాకేష్, రవి, నవ్య, తదితరులు పాల్గొన్నారు.
రైతులకు అవగాహన కల్పించాలి
గాంధారి(ఎల్లారెడ్డి): గ్రామాలు, తండాల్లో ఫెర్టిలైజర్ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించాలని ఏవో రా జలింగం సూచించారు. మంగళవారం స్థానిక రైతు వే దిక భవనంలో ఏఈవోలు, జీపీవోలతో సమావేశం ఏ ర్పాటు చేసి అవగాహన కల్పించారు. పు రుగు మందులు, ఫెర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంతో పాటు దేమికలాన్ సింగిల్ విండో కార్యాలయాలలో మంగళవారం యూరియా ఎరువుల కోసం బుకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమపట్టా పాస్ పుస్తకాలతో కార్యాలయాలకు వచ్చి తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. ప్రత్యేక అధికారులు లక్ష్మణ్, విష్ణు, సీఈవో నర్సింలు, సిబ్బంది పాల్గొన్నారు.
యాప్‌తో ఎరువుల కొనుగోలు సులభం
యాప్‌తో ఎరువుల కొనుగోలు సులభం


