పంటల రక్షణ కోసం పాత చీరలు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): రబీ సీజన్‌లో వేసిన పంటలను కాపాడుకోవడానికి రైతులు పాత చీరలను వాడుతున్నారు. చేతికి వచ్చిన పంటలను అడవి జంతువులు దాడి చేసి చేసి ధ్వంసం చేస్తాయనే భయంతో ముందు జాగ్రత్తగా పంటల చుట్టూ పాత చీరలను కడుతున్నారు. బిర్నీస్, మొక్కజొన్న, జొన్న, కూరగాయలు పంటల్లోకి కోతులు, అడవి పందులు గుంపులు గుంపులుగా వచ్చి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. గత్యంతరం లేక ఉన్న పంటలను ఎలాగైనా కాపాడుకుందామని కామారెడ్డితో పాటు తదితర ప్రాంతాలలో జరిగే సంతలకు వెళ్లి పాత చీరలను కొనుగోలు చేసి, పంటల చుట్టూ కడుతున్నారు.


