
13న జాతీయ లోక్ అదాలత్
కామారెడ్డి టౌన్ : జాతీయ లోక్ అదాలత్‌ను వచ్చేనెల 13న నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ వీఆర్‌ఆర్ వరప్రసాద్ తెలిపారు. శనివారం కోర్టు హాల్‌లో పోలీసులు, న్యాయమూర్తులు ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ లోక్ అదాలత్‌లో సివిల్ కేసులు, రాజీకి వచ్చే క్రిమినల్, వైవాహిక తగాదాలు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్, బ్యాంకు రికవరీ తదితర కేసులను వీలైనంత ఎక్కువ పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జి సెక్రెటరీ ఈట సుమలత, ఎస్పీ రాజేశ్ చంద్ర, అదనపు కలెక్టర్ విక్టర్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హనుమంత్‌రావు, సబ్ జైలు సూపరింటెండెంట్ సంజీవరెడ్డి, ఎస్సై మురళి, జిల్లా కోర్టు ఏవో లక్ష్మీకాంత్, డీఎల్‌ఎస్‌ఏ సూపరింటెండెంట్ చంద్రసేన్‌రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ ఖాజా సమీ తదితరులు పాల్గొన్నారు.
ఒకటో తేదీ నుంచి
రేషన్ బియ్యం పంపిణీ
కామారెడ్డి రూరల్ : రేషన్ షాప్‌ల ద్వారా సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఉచిత బియ్యం పంపిణీ ఒకటో తేదీన ప్రారంభం కానుంది. ఒక్కో యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని జూన్‌లో ఒకేసారి అందించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌లో మాత్రం ఒకే నెలకు సంబంధించిన బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాలశాఖ అధికారులు తెలిపారు.
‘సాగర్’ గేట్లు మూసివేత
నిజాంసాగర్ : ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ ఫ్లో తగ్గుముఖం పట్టడంతో శనివారం మ ధ్యాహ్నం నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లను మూసి వేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఉమ్మడి జిల్లా వరప్రదాయని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఈనెల 18 నుంచి శనివారం ఉదయం వరకు ఆరు రోజుల పాటు నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ నెలలో కురిసిన వర్షాల వల్ల ఎగువ ప్రాంతాల నుంచి 40.70 టీఎంసీల ఇన్‌ఫ్లో వచ్చిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజె క్టు వరద గేట్ల ద్వారా ఆరు రోజుల్లో 27.151 టీఎంసీల నీటిని మంజీర నదిలోకి విడుదల చేశామన్నారు. శనివారం సాయంత్రం 13,590 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1,404 అడుగుల (16.357 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు.
‘బోర్డులు తప్పనిసరి’
బీబీపేట: ఫర్టిలైజర్ దుకాణాలకు, గోదాములకు బోర్డులు తప్పనిసరిగా ఉండాలని డీఏవో మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆ యన బీబీపేటలోని ఫర్టిలైజర్ దుకాణాలు, గోదాములను సందర్శించారు. వాటికి ఎ లాంటి బోర్డులు లేకపోవడంతో ఆయన ఆ గ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లోగా బో ర్డులు పెట్టాలని, లేకుంటే లైసెన్స్‌లు రద్దు చే స్తానని దుకాణాదారులను హెచ్చరించారు. ఇ–పాస్ యంత్రం ద్వారానే ఎరువులు పంపిణీ చేయాలన్నారు. ఆయన వెంట ఏడీఏ అపర్ణ, ఏవో నరేందర్, ఏఈవోలు రాఘవేంద్ర, సంతోష్, రాజేష్ ఉన్నారు.
‘పారదర్శకంగా
ఆడిటింగ్ నిర్వహిస్తున్నాం’
కామారెడ్డి టౌన్ : జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులలో ఆడిటింగ్‌ను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని డీసీహెచ్‌ఎస్ విజయలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఎలాంటి అవకతవకలు జరుగకుండా చూస్తామని, స్వయంగా ప్రతి సీహెచ్‌సీని సందర్శిస్తానని తెలిపారు. అడిటింగ్ సిబ్బందికి వైద్య సిబ్బంది సహకరించాలని సూచించారు.

13న జాతీయ లోక్ అదాలత్