
సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలి
సాక్షి నెట్‌వర్క్: సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో శనివారం జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో స్థానిక తహసీల్దార్లకు, బాన్సువాడలో సబ్ కలెక్టర్‌కు వినతిపత్రాలను అందజేశారు. పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. అలాగే హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద యూఎస్‌పీసీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మహాధర్నాకు జిల్లా నుంచి ఉపాధ్యాయులు, నాయకులు తరలివెళ్లారు.

సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలి