
రెండేళ్ల చిన్నారిపై పిచ్చికుక్క దాడి
● జిల్లా ఆస్పత్రికి తరలింపు
నందిపేట్(ఆర్మూర్): మండల కేంద్రంలోని వడ్డెర కాలనీలో శనివారం అల్లెపు అక్షర అనే రెండేళ్ల చిన్నారిపై పిచ్చికుక్క దాడి చేసింది. దీంతో తీవ్ర గాయాలై పరిస్థితి విషమించడంతో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నారి అక్షప మధ్యాహ్నం తన ఇంటి ఎదుట ఆడుకుంటుండగా పిచ్చికుక్క ఒక్కసారిగా దాడి చేసింది. కుక్క దాడి చేస్తుండగా గమనించిన చిన్నారి అమ్మమ్మ కర్రతో ఎంత తరిమినా వదలకుండా చిన్నారిని కరవడంతో ముఖం, చెంప, భుజంపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, కుటుంబీకులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్సులో జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఆర్మూర్‌లో ఒకరికి..
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉదయం వాకింగ్‌కు వెళుతున్న శ్రీనివాస్‌రావు అనే వ్యక్తిని కుక్కలు వెంబడించాయి. దీంతో ఆయన జారిపడటంతో కుక్కలు దాడి చేసి గాయపర్చాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లగా ఎడమకాలు విరిగినట్లు బాధితుడు తెలిపారు.

రెండేళ్ల చిన్నారిపై పిచ్చికుక్క దాడి