
నాగిరెడ్డిపేటలో 85 శాతం ‘సీ్త్రనిధి’ రుణ బకాయిలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): సీ్త్రనిధి రుణాలకు సంబంధించి నాగిరెడ్డిపేట మండలంలో 85శాతం బకాయిలు పేరుకుపోయాయని సీ్త్రనిధి జిల్లా మేనేజర్ కిరణ్ తెలిపారు. మండలకేంద్రం గో పాల్‌పేటలో సీ్త్రనిఽధి ద్వారా ఇవ్వనున్న సౌభా గ్య, ఐశ్వర్య రుణాలకు సంబంధించిన వ్యాపారాలను శనివారం ఆయన పరిశీలించారు. అ నంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 2025–26ఆర్థిక సంవత్సరంలో సీ్త్రనిధి ద్వారా రూ.95కోట్లు రుణాలుగా ఇవ్వాలని ల క్ష్యంగా నిర్ణయించామన్నారు. దీనిలో ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా రూ.30కోట్లు రుణాలుగా ఇచ్చామని ఆయన చెప్పారు. కాగా జిల్లాలో 50శాతం సీ్త్రనిధి రుణబకాయిలుండగా వాటిలో నాగిరెడ్డిపేట మండలంలోనే 85శాతం రుణబకాయిలు పేరుకుపోయాయయని వివరించా రు. బకాయిల వసూళ్ల కోసం ప్రతి మంగళవారం, గురువారం స్పెషల్‌డ్రైవ్ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఐకెపీ సీసీ దత్తు ఉన్నారు.
రోడ్డు విస్తరణ పనులకు సహకరించాలి
నిజాంసాగర్(జుక్కల్): హైదరాబాద్–బోధన్ రహదారి విస్తరణ పనులకు రైతులు సహకరించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అ న్నారు. రహదారికి ఇరువైపులా భూములు కో ల్పోతున్న రైతులకు పరిహారం అందేలా చూ స్తామన్నారు. మహమ్మద్ నగర్ మండల తహశీల్ కార్యాలయంలో శనివారం ఆమె మహమ్మద్ నగర్, బూర్గుల్, గున్కుల్ గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు. రహదారికి భూములు ఇవ్వాలని, విస్తరణ పనులను ఆపవద్దన్నారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి, స్థానిక విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. తహసీల్దార్ సవాయిసింగ్, డిప్యూటీ తహసీల్దార్ క్రాంతికుమార్, హెచ్‌ఎం మధుసూదన్‌రాజ్, గిర్దావర్ పండరి ఉన్నారు.
మద్యం పాలసీలో
25శాతం రిజర్వేషన్ కల్పించాలి
కామారెడ్డి టౌన్: ప్రభుత్వ మద్యం పాలసీలో గౌడ కులస్తులకు 25 శాతం రిజర్వేషన్ కల్పించాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌గౌడ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా 25శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతీ గ్రామంలో ఈత వనాలను పెంచడానికి 10 ఎకరాలను కేటాయించాలన్నారు. సాయాగౌడ్, రవీందర్‌గౌడ్, రాజు,రమేష్ తదితరులున్నారు.

నాగిరెడ్డిపేటలో 85 శాతం ‘సీ్త్రనిధి’ రుణ బకాయిలు

నాగిరెడ్డిపేటలో 85 శాతం ‘సీ్త్రనిధి’ రుణ బకాయిలు