
యూరియా కోసం బారులు
పోలీసు పహారాలో పంపిణీ
మాచారెడ్డి : యూరియా కోసం శనివారం మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయానికి రైతు లు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసుల పహారాలో పంపిణీ చేశారు. విండోలో 450 బస్తాల యూ రియా ఉండగా.. దానిని రైతులకు అందించారు. సాయంత్రం చీకటి పడే వరకు పంపిణీ కొనసాగింది. కాగా యూరియా కోసం రైతులు గొడవకు దిగగా.. జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి, కామా రెడ్డి ఏడీఏ అపర్ణ అక్కడికి చేరుకుని వారిని సము దాయించారు. దీంతో గొడవ సద్దుమణిగింది.
బీబీపేటలో..
బీబీపేట: మండలకేంద్రంలోని సింగిల్ విండో కా ర్యాలయానికి శనివారం 440 బ్యాగ్‌ల యూరియా వచ్చింది. రైతులు ఉదయమే కార్యాలయం వద్దకు చేరుకుని బారులు తీరారు. ఒక్కో రైతుకు ఒక బ్యాగ్ చొప్పున ఇచ్చారు. ఎరువుల పంపిణీని డీఏవో మోహన్‌రెడ్డి పరిశీలించి, రైతులతో మాట్లాడారు. అవసరానికి మించి యూరియా వాడడం వల్లే కొరత ఏర్పడుతోందన్నారు. రైతులు నానో యూరియా వాడాలని సూచించారు.

యూరియా కోసం బారులు

యూరియా కోసం బారులు